హైదరాబాద్ లో దారుణం: ఆరేళ్ల చిన్నారి పై లైంగిక దాడి

హైదరాబాద్ లోని  నాంపల్లి లో దారుణం జరిగింది .. ఆరేళ్ళ చిన్నారి పై స్కూల్ ఆటో డ్రైవర్  లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నాంపల్లిలోని గ్లోబల్ టెక్నో స్కూల్ లో చదువుతున్న 6 సంవత్సరాల పాపను స్కూల్ ఆటో డ్రైవర్ నాయీమ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత రెండు నెలలు గా బాలికను స్కూల్ నుండి ఇంటికి తీసుకువస్తున్న నాయీమ్.. నిన్న(శనివారం) స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆటోను బజార్ ఘాట్ వైపు తీసుకెళ్లి  పాపపై అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు ఆటో డ్రైవర్ నాయీమ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలికను తీసుకువెళ్లిన ఆటోను పోలీసులు సీజ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates