హైదరాబాద్ లో దారుణం : రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా…ఒక్కరూ పట్టించుకోలేదు

హైదరాబాద్ లో దారుణం జరిగింది. జీబ్రా లైన్ పై ఓ మహిళ తన తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ లారీ వాళ్లని తొక్కించుకుంటూ వెళ్లిపోయింది. రక్తం కారుతూ రోడ్డుపై పడి ఉన్న భాధితులిద్దరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రోడ్డుపై వాహనాలు, ప్రజలు తిరుగుతున్నప్పటికీ ఒక్కరు కూడా వాళ్లని హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రమాద భాధితులు ఇద్దరూ రోడ్డుపైనే చనిపోయారు. అయితే రద్దీగా ఉన్న రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే ఒక్కరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది.

Posted in Uncategorized

Latest Updates