హైదరాబాద్ లో దారుణం : సెల్ ఫోన్ కోసం ఇంటర్ స్టూడెంట్ కిడ్నాప్, హత్య

వాళ్లిద్దరూ స్నేహితులు.. ఇంటర్మీడియట్ చదువుతున్నారు.. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారు.. కలిసిమెలిసి తిరుగుతుంటారు.. అయినా వారిలో ఓ స్టూడెంట్ మాత్రం స్నేహం చేస్తున్నట్లు నటించాడు.. అదును చూసి చంపేశాడు.. అంతేకాదు పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశాడు.. ఈ ఘోరం చేసింది ఇంటర్ చదివే స్టూడెంట్ కావటం కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు ఇంటర్ స్టూడెంట్  ప్రేమ్ కుమార్. ఆ రోజు పోలీస్ కంప్లయింట్ నమోదు అయ్యింది. అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో పోలీసులు విచారణ చేపట్టారు. రామాంతపూర్ బస్తీలో ఉండే సాగర్ అనే యువకుడితో స్నేహం ఉందని.. అతని బైక్ పై వెళ్లటం చూశాం అని బస్తీవాసులు చెప్పారు. వెంటనే సాగర్ కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు.. ఆ కుర్రోడిని అదుపులోకి తీసుకున్నారు. మొదట తెలియదని బుకాయించినా.. ఆ తర్వాత అసలు నిజం చెప్పాడు. ప్రేమ్ కుమార్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కోసమే చంపినట్లు ఒప్పుకున్నాడు. షాక్ అయిన పోలీసులు.. మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రేమ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కోసం.. సాగర్ ప్లాన్ వేశాడు. బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పాడు. దీనికి అంగీకరించిన ప్రేమ్.. సాగర్ బైక్ ఎక్కాడు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు నుంచి ఆదిభట్ల తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపాడు. సెల్ ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఇవ్వనంటూ ప్రేమ్ తేల్చిచెప్పాడు. దీంతో రాయి తీసుకుని ప్రేమ్ ను కొట్టి చంపాడు. ఆ తర్వాత ఘట్ కేసర్ దగ్గర పెట్రోల్ కొనుగోలు చేసి ప్రేమ్ మృతదేహాన్ని కాల్చేశాడు. ఏమీ తెలియదన్నట్లు రాత్రికి ఇంటికి వచ్చి పడుకున్నాడు. కేవలం సెల్ ఫోన్ కోసమే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు సాగర్. విషయం తెలిసి ప్రేమ్ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. నాటకాలు వేస్తూ.. ఇంట్లో టైలరింగ్ చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఇంటర్ కు వచ్చిన కుమారుడిని బాగా చదివించి.. మంచి ఉద్యోగంలో చూడాలని ఎన్నో కలలు కన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. కుమారుడి చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.

ఓ సెల్ ఫోన్ కోసం కొడుకు హత్యకు గురవ్వటంతో షాక్ లో ఉన్నారు ప్రేమ్ పేరంట్స్..

Posted in Uncategorized

Latest Updates