హైదరాబాద్ లో నీట మునిగి 100 గేదెలు మృతి

హైదరాబాద్: భారీ వర్షాలు మనుషుల ప్రాణాలనే కాదు.. నోరులేని మూగ జీవుల ప్రాణాలను సైతం బలి తీసుకున్నాయి.  నీట మునిగి దాదాపు 100 గేదెలు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన  హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్టలోని హాశమాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పల్లె చెరువుకు గండి పడింది. భారీగా వర్షపు నీరు హాశమబాద్ ప్రాంతాన్ని ముంచెత్తింది. లోతట్టు ప్రాంతం అయినందున ఆ ప్రాంతం మొత్తం ఇప్పటికీ జలదిగ్భందంలో ఉంది. ఈ ప్రాంతంలో పలుచోట్ల గేదెల దొడ్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 కుపైగా గేదెలు ఉన్నట్టు సమాచారం. వరద నీటిలో గేదెల దొడ్లు పూర్తిగా మునిగిపోయాయి. ఈ రోజు నీటి ప్రవాహం తగ్గడంతో మృతి చెందిన గేదెలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెటర్నరీ సిబ్బంది వచ్చి మృతి చెందిన గేదెలను బయటకు తీశారు.

Latest Updates