దొరికాడు.. రిషభ్ చిట్ ఫండ్ స్కామ్ నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ : రిషభ్ చిట్ ఫండ్ స్కామ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న శైలేష్ గుజ్జర్ దంపతులను అరెస్ట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయ గూడలోని వాళ్ల ఇంట్లోనే.. ఇవాళ గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. పోలీసులు గంటన్నరపాటు గుజ్జార్ దంపతుల ఇంట్లో సోదాలు చేశారు. రూ.200 కోట్ల స్కాం చేసిన శైలేష్ గుజ్జార్  కు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు పోలీసులు. తర్వాత.. వారిని సీసీెస్ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు.

సికింద్రాబాద్‌ సుభాష్‌ రోడ్డులో 20 ఏళ్లుగా రిషభ్‌ చిట్‌ఫండ్స్‌ పేరుతో శైలేష్‌ గుజ్జర్‌ అనే వ్యక్తి డిపాజిట్, చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొన్ని చిట్టీలు చట్టప్రకారం ఉండగా.. అధిక శాతం చిట్టీలను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీ ఆశ చూపి… చిట్టీల గడువు ముగిసినా డబ్బు తనవద్దే ఉంచుకున్నాడు. 6వందల మంది అతని వద్ద చిట్స్  వేశారు. నమ్మినందుకు నట్టేట ముంచి.. నవంబర్ నెల చివరివారంలో.. కోట్ల రూపాయలతో ఉడాయించాడు. కొన్ని రోజులుగా చిట్‌ ఫండ్‌ కార్యాలయానికి, శైలేష్‌ ఇంటికి తాళం వేసి ఉండటంతో బాధితులు పోలీసులకు కంప్లయింట్స్ ఇచ్చారు.  శైలేష్‌ గుజ్జర్‌ తమను మోసం చేశాడంటూ… బాధితులు డిసెంబర్-2న మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కింద.. సీసీఎస్ పోలీసులకు గోడు చెప్పుకున్నారు.. నిందితుడిపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ..పక్కా సమాచారంతో గురువారం అదుపులోకి తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates