హైదరాబాద్ లో పలుచోట్ల చిరు జల్లులు

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లో ఉదయం నుంచి చలిగాలులు వీచాయి. సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నగర శివారులోని రాజేందర్ నగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, బండ్లగూడ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీ, మణికొండ మునిసిపాలిటీలోని పలు ప్రాంతాలలో చిరు జల్లులు కురుస్తున్నాయి. అటు నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో విద్యుత్ కు అంతరాయం కలిగింది.

Latest Updates