హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

rainహైదరాబాద్ లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మంగళవారం (జూన్-12) ఉదయం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకున్నా.. చిరుజల్లులు కూడా పడలేదు. అయితే మంగళవారం సాయంత్రం నగరంలోని ముషీరాబాద్‌, కోఠి, అబిడ్స్‌ లో ఈదురుగాలుతో కూడిన వర్షం పడుతోంది.

మలక్‌ పేట, చంపాపేట్‌, సైదాబాద్‌, సంతోష్‌ నగర్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌ చైతన్యపురి, కొత్తపేట, మీర్‌ పేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లు జలమయం అయ్యాయి. మరో రెండు రోజులపాటు నగరానికి వర్ష సూచన ఉంది. కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో ఉరుములతో కూడిన భారీ వర్షంతోపాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం  తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates