హైదరాబాద్ లో పలుచోట్ల మోస్తరు వర్షం

హైదరాబాద్ : సిటీలో పలుచోట్ల ఇవాళ (అక్టోబర్-15)న సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి కాస్త ట్రాఫిక్ జామ్ అవుతోంది. కంట్రోల్ చేసే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు. నిన్న కూడా సిటిలో కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండల తీవ్రత.. సిటీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా..రెండు రోజులుగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించినట్లైంది.

Posted in Uncategorized

Latest Updates