హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్ : చాలా రోజుల తర్వాత సిటీ వాసులను వర్షం పలకరించింది. ఆదివారం (అక్టోబర్-14)న రాత్రి హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండల తీవ్రత.. సిటీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా..ఇవాళ కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.

Posted in Uncategorized

Latest Updates