హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

FIRE ACCIDENT KRISHNA NAGERహైదరాబాద్ లోని యూసుఫ్‌ గూడ కృష్ణానగర్‌ లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం (జూలై-5)అర్థరాత్రి మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను ఆర్పేశారు.  7 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొదటి, రెండో అంతస్తుల్లోని పెయింట్స్ దుకాణంలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. క్రేన్‌ ల సహాయంతో GHMC సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు.

ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపేసి… చుట్టుపక్కల ప్రాంతాల ఇళ్లల్లోని జనాన్ని ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates