హైదరాబాద్ లో భారీ వర్షం..ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఇవాళ (సెప్టెంబర్-26) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, LB  నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆఫీస్ టైమ్ కావడంతో.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై నిలిచిన నీటినిల్వను తొలగిస్తున్నారు GHMC సిబ్బంది. సమస్యలుంటే డయల్ 100కు, కాల్‌ సెంటర్ 040-21111111లకు ఫోన్ చేయాలని తెలిపారు కమిషనర్ దానకిశోర్.

ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.6కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో.. వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణశాఖ. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణశాఖ.

Posted in Uncategorized

Latest Updates