హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు ఏరులై పారుతోంది. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, బేగంపేట, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపై నీరు వచ్చి చేరడంతో పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్ధంభించింది.

Posted in Uncategorized

Latest Updates