హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ అరెస్ట్

drugs

హైద్రాబాద్ లో గుట్టు చ‌ప్పుడు కాకుండా డ్ర‌గ్ స‌ప్లై చేస్తున్న‌ ముగ్గురు వ్య‌క్తుల‌ ముఠాను సెంట్ర‌ల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్ర‌గ్ తెచ్చి సిటీలో విక్ర‌యిస్తున్న‌ ఒక‌ నైజేరియన్ తో పాటు జ‌మ్ము కాశ్మీర్ కి చెందిన హ‌బిద్ న‌జీర్ ,హైద్రాబాద్ శివారు ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థి యాష్ సుంక‌రి ల‌ను మంగళవారం ( ఫిబ్రవరి-6) అరెస్ట్ చేశారు. వారి నుండి 75 గ్రాముల ఎల్.ఎస్.డి స్టాంప్స్.30 గ్రాముల‌ చ‌రాస్.ఒక‌ గ్రాము హెరాయిన్.30 గ్రాముల‌ గంజాను స్వాధీనం చేసుకున్న‌ట్లు టాస్క్ పోర్స్ డిసిపి రాధాకిష‌న్ రావు తెలిపారు.

నైజేరియన్ కి చెందిన అంగోలా అల్మా ప్రైడే గ‌డువు ముగిసిన‌ విసా తో ఇండియాలోనే ఉంటున్నాడు. ఈజీ మ‌నీ కోసం స్నాప్ షాట్ యాప్ ద్వారా ప‌రిచ‌యాలు పెంచుకున్నాడు. జ‌మ్ము కాశ్మీర్ కి చెందిన అబిద్ న‌జీర్. హైద్రాబాద్ బాగ్ అంబ‌ర్ పేట్ కు చెందిన‌ స్టూడెంట్ యాష్ సుంక‌రీల‌తో క‌లిసి డ్ర‌గ్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇటీవ‌ల‌ డ్ర‌గ్ పై పోలీసులు సీరియ‌స్ గా తీసుకుని నిఘా పెట్టిన‌ క్రమంలో విశ్వ‌స‌నీయ‌ స‌మాచారం ట‌స్క్ ఫోర్స్ పోలీసుల‌కు అందింది. దీంతొ అల‌ర్టైన‌ పోలీసులు గోవా నుంచి డ్రగ్స్ స‌ప్లై చేస్తున్న‌ వారిపై నిఘా పెట్టారు. విద్యార్థుల‌కు డ్రగ్స్ ను అమ్మడానికి ప్లాన్ చేస్తుండ‌గా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు ల‌క్ష‌ల‌ విలువైన‌ డ్ర‌గ్ ను స్వాధీనం చేసుకుని త‌దుప‌రి విచార‌ణ‌ కోసం నారాయ‌ణ‌గూడ‌ పోలీసుల‌కు అప‌గిస్తున్న‌ట్లు టాస్క్ పోర్స్ డిసిపి రాధాకిష‌న్ రావు తెలిపారు.

ప్రధాన నిందితుడు హైదరాబాదీ

నిందుతుల్లో అంబర్ పేట్ కి చెందన డిగ్రీ విద్యార్థి సుంకర యాష్ ప్రధాన నిందుతుడిగా ఉన్నాడు. డ్రగ్స్ కోసం  యాష్ నిత్యం గోవాకు వెళ్తుంటాడని, అక్కడున్న ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ కు డ్రగ్స్ సఫ్లై చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.  యాష్ తండ్రి ఓ వ్యాపారవేత్త అని కాలేజ్ లో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారా అనే దానిపై దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates