హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్‌

హైదరాబాద్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడ్డ ముగ్గురు వరుసకు అక్కచెళ్లెల్లే. వీరిని ఆత్మకూరు భవని, అన్నపూర్ణ, అనూషలుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లోని మౌలాలిలో విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కామేశ్వర్రావు అనే మరో మావోయిస్టునూ విశాఖలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు సమయంలో ఇతని దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నట్లు చెప్పారు. సిటీలో మావోయిస్టులు తలదాచుకన్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. వీరిలో అనూష… మావోయిస్టు కీలక నేత ఆర్కేకు అంగరక్షకురాలిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళా మావోయిస్టుల ప్రధాన కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయని చెప్పారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates