హైదరాబాద్ లో రేపట్నుంచి నేషనల్ బుక్ ఫెయిర్

హైదరాబాద్ లో శనివారం డిసెంబర్-15 నుంచి 25 వ తేదీ వరకు నేషనల్ బుక్ ఫెయిర్‌ జరగనుంది.  బుక్ ఫెయిర్  ఎన్టీఆర్ స్టేడియంలో పదకొండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. ఈ పండుగలో దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ర్టాలు పాల్గొననున్నాయి. 330 స్టాల్స్‌ తో పలువురు పబ్లిషర్స్ పాల్గొననున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాష, ఇంకా మరెన్నో భాషల పుస్తకాలు ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి.

ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాల బాలికలకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిత్రలేఖనం పోటీలు, గ్రూప్ డ్యాన్స్ పోటీలు, గ్రూప్ సాంగ్స్ పోటీలు, సోలో సాంగ్స్ పోటీలు, ఒక్క నిమిషం తెలుగు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, డాన్స్ పోటీలు, బాలల మిమిక్రి పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు.  పలు అంశాలపై బాలబాలికలకు వర్క్‌ పాపులు నిర్వహిస్తున్నారు.  ప్రదర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు బుక్ ఫెయిర్ నిర్వాహకులు, పోలీసులు.

బుక్ ఫెయిర్ ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్, గౌరవ అతిథులుగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు విచ్చేస్తున్నారు. ప్రారంభ సమావేశం శనివారం సాయంత్రం 5:30 గంటలకు జరుగనుంది.

Posted in Uncategorized

Latest Updates