హైదరాబాద్ లో లిక్కర్ చాక్లెట్లు..పోలీసుల అదుపులో ముఠా


ద్రవ రూపంలోనే కాదు ఘన పదార్ధంలో కూడా లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది తయారు చేసేది మాత్రం లిక్కర్ సంస్థలు కాదు…ఓ మాఫియా. బ్రాందీ, విస్కీ, రమ్ముతో తయారు చేసిన లిక్కర్‌ చాక్లెట్లను తయారు చేస్తున్నారు. అలాంటి ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్‌ చాక్లెట్లను డెన్మార్క్‌ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్‌ నగరాల్లో సేల్ చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ చాక్లెట్‌ డిస్ట్రిబ్యూటర్‌ ముఠాతో అగ్రిమెంట్ చేసుకుని అమ్ముతుండగా హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్‌లో 4 శాతం ఆల్కహాల్‌ ఉన్నట్లు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates