హైదరాబాద్ లో వర్షం.. ఆగిన బతుకమ్మ ఆటలు

హైదరాబాద్ : హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో సాయంత్రం వర్షం దంచికొట్టింది. రెండురోజులుగా సాయంత్రం వేళ చినుకులు సందడి చేస్తున్నాయి. ఐతే…. మంగళవారం సాయంత్రం వర్షం బాగానే కురిసింది. జంట నగరాల్లో ఇళ్లముందర సాయంత్రం బతుకమ్మ ఆటపాటలు నిలిచిపోయాయి. బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడపడుచులు ఇబ్బందిపడ్డారు. దుర్గమ్మ మంటపాల్లో పూజలకు అంతరాయం కలిగింది.

తమిళనాడు నుంచి వైజాగ్ మీదుగా ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఫలితంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని… రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates