హైదరాబాద్ లో శ్రీదేవి సంతాప సభ: తలసాని

talsaniశ్రీదేవి మృతి సినీ ఇండస్ట్రీకే కాకుండా ఆమె అభిమానులకు తీరని లోటన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. హైదరాబాద్ లో త్వరలో  సినిమా ప‌రిశ్ర‌మ‌ ప్రముఖుల సమక్షంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు ప్ర‌క‌టించారు. బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి.. అలనాటి అగ్ర నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులతో పాటు అనేకమంది నటులతో అనేక సినిమాల్లో నటించారన్నారు. తన నటనతో అభిమానులను మెప్పించిన నటి శ్రీదేవి అని అన్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా నటించిన శ్రీదేవి.. దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు మంత్రి తలసాని.

Posted in Uncategorized

Latest Updates