హైదరాబాద్ లో సేయిలింగ్ వీక్ : కనువిందు చేస్తున్న పడవ పందాలు

SAILING WEEKహుస్సేన్ సాగర్ లో పడవ పందాలు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ సేయిలింగ్ వీక్ లో భాగంగా ఏటా జరిగే సీనియర్ మల్టీ క్లాస్ ర్యాంకింగ్ సేయిలింగ్ ఛాంపియన్షిప్ ఉత్సాహంగా జరుగుతోంది. జులై 8వ తేది వరకు ఈ పోటీలు జరగనున్నాయి. అలలను చేధించుకుంటూ దూసుకెళ్లే సేయిలర్లు. కొత్తగా రూపుదిద్దుకున్న లేసర్ బోట్ లతో.. హుస్సేన్ సాగర్ కు కొత్త అందాన్ని తెస్తోంది హైదరాబాద్ సేయిలింగ్ వీక్.

యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో EME సేయిలింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈనెల 3 నుంచి జరుగుతున్నాయి. ఇందులో వివిధ రాష్ట్రాలు, ఆర్మ్ డ్ ఫోర్స్ లకు చెందిన 15 క్లబ్ ల నుంచి 181 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్ ఈవెంట్స్ అయిన ఆప్టిమిస్ట్, లేసర్ పీకో, లేసర్ స్టాండర్డ్ కేటగిరీస్ తో పాటు ఆర్.ఎక్స్, 4.7 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రేస్ పర్యవేక్షణ కోసం 8 మంది అంతర్జాతీయ రేస్ డైరెక్టర్లను ఏర్పాటు చేశారు EME సేయిలింగ్ అసోసియేషన్ ప్రతినిధులు.

హైదరాబాద్ లో 33వ సారి జరుగుతున్న ఈ మల్టీ క్లాస్ ర్యాంకింగ్ సేయిలింగ్ ఛాంపియన్షిప్ లో జాతీయ,  అంతర్జాతీయ ప్లేయర్స్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కి చెందిన అశ్విని, కీర్తన, సంజయ్ రెడ్డి ఉన్నారు. సంజయ్ రెడ్డి గతేడాది 4.7 విభాగంలో మెడల్ సాధించాడు. ఈసారి పోటీల్లోనూ విజేతగా నిలిచి ఏషియన్ గేమ్స్ లో పాల్గొనడమే లక్ష్యమని చెబుతున్నాడు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్లేయర్స్ ని.. ర్యాంకింగ్స్ ఆధారంగా సెప్టెంబర్ లో జరిగే ఏసియన్ గేమ్స్ కు ఎంపిక చేయనుంది యాటింగ్ అసోసియషన్ ఆఫ్ ఇండియా. 2020 ఒలింపిక్స్ లోనూ భారత్ తరపున ప్రాతనిధ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates