హైదరాబాద్ లో GHMC కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ లో పలుచోట్ల GHMC కమిషనర్ దానకిషోర్ ఇవాళ (గురువారం) ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం సికింద్రాబాద్ లో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహిరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు కమిషనర్.

ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజీ, వాటర్ పైప్ లీకేజ్ ఉంటే సంబంధిత జలమండలి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆలుగడ్డ బావి  సమీపంలో పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన ఆయన మరింత పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. ప్రధాన రహదారులపై నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లు తొలగించని అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates