హైదరాబాద్ లో పాక్ ISI కదలికలు.. నల్లకుంటలో ఒకరి అరెస్ట్

హైదరాబాద్ నల్లకుంట ఏరియాలో పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్(ISI) కదలికలు అలజడి రేపాయి. ISI ఏజెంట్ అన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్లకుంటకు చెందిన దినేష్ కు…. పాకిస్తాన్ నుంచి వరుసగా కాల్స్ వచ్చినట్టు గుర్తించారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్-VOIP ద్వారా అతడు మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. తాను మాట్లాడుతున్నది ఎవరికీ తెలియకుండా ఉండేందుకు… VOIP టెక్నాలజీ డివైజ్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. మిలటరీ ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో… నల్లకుంట పోలీసులు తనిఖీలు చేసి దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉంటున్న ప్రాంతంలోనే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సిస్టమ్ ను కూడా సీజ్ చేశారు. దినేష్ నుంచి రెండు సిమ్ బాక్సులు, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఐఎస్ఐ నుంచి వరుసగా కాల్స్ రిసీవ్ చేసుకుని.. మాట్లాడిన దినేష్ ను.. నల్లకుంటలో ఎక్కడ అరెస్ట్ చేశారన్నది మాత్రం పోలీసులు చెప్పలేదు. ఇంటరాగేషన్ లో దినేష్ చెప్పే వివరాలతో హైదరాబాద్ లో మరికొన్ని చోట్ల పోలీసులు సోదాలు చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates