హైదరాబాద్ లో ITIR ఏర్పాటు సాధ్యం కాదు: రవిశంకర్

హైదరాబాద్ లో ITIR ఏర్పాటు చేయడం లేదని తేల్చిచెప్పారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ITIRకు భూసేకరణ,  ల్యాండ్ పూలింగ్ పెద్ద సమస్యగా మారిందనీ, అందుకే ITIRపై నిర్ణయం వెనక్కి తీసుకున్నామని చెప్పారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తూ అనుమతులపై పూర్తి సహకారం అందిస్తామన్నారు రవిశంకర్.

మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన, సాధించిన అభివృద్ధి అనే అంశంపై హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి రవిశంకర్. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు భారత్ అభివృద్ధి పై నివేదిక ఇచ్చాయని చెప్పారు.

అధికారంలోకి వచ్చి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు మంత్రి. పాకిస్థాన్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి దేశ సమగ్రతను కాపాడామనీ, నోట్లరద్దుతో నల్లధనాన్ని బయటకు తెచ్చామని చెప్పారు. హైదరాబాద్ దేశానికే ఐటీ సిటీగా మారిందన్నారు. భవిష్యత్తుతలో చిన్న నగరాలకూ ఐటీని విస్తరిస్తామని చెప్పారు రవిశంకర్ ప్రసాద్.

Posted in Uncategorized

Latest Updates