హైదరాబాద్ వస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షా

లోక్ సభ సీట్ల పంపకంపై పలువురి నేతలతో సమావేశమవుతూ బిజీగా పర్యటిస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షా హైదరాబాద్ టూర్ కన్ఫామ్ అయ్యింది. జూలై 13వ తేదీ శుక్రవారం హైదరాబాద్ కు వస్తున్నారు.  ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షాకు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆఫీస్ కు వెళతారు. ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. అనంతరం ప్రముఖులతో భేటీ అవుతారు. పత్రిక, టీవీ ఛానల్స్ అధినేతలతో ఈ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాత్రి 7 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళతారు.

Posted in Uncategorized

Latest Updates