హై అలర్ట్ : దూసుకొస్తున్న పెథాయ్ తుపాను

ఏపీ : దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్  తుపాను కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరికొద్ది గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారనుంది. రేపు సాయంత్రం కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటనుంది. తీరం దాటిన  తర్వాత బలహీన పడి వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెథాయ్ తుపాను కాకినాడకు 670 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తోందన్నారు.

ఇప్పటికే పెథాయ్  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి, గాలుల తీవ్రత పెరిగాయి. కృష్ణా జిల్లాపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. బందరు, తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో పలు చోట్ల చిరుజల్లులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు పెథాయ్  తుపాను నేపథ్యంలో ఆరు మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates