హోండా గోల్డ్ వింగ్ : రివర్స్ గేర్, ఎయిర్ బ్యాగ్స్ ఈ బైక్ స్పెషల్

బైక్ అనగానే ముందుకే వెళుతుంది.. వెనక్కి వెళ్లాలంటే మన కాళ్లే మనకు గేర్లు. కార్లు అయితే రివర్స్ గేర్ వేయగానే ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంది. ఇలాంటి ఆప్షన్ ను.. బైక్స్ లో కూడా తీసుకొచ్చింది హోండా కంపెనీ. కొత్తగా లాంఛ్ చేస్తున్న సూపర్ పవర్ బైక్ లో రివర్స్ గేర్ ఆప్షన్ ఇచ్చింది. ఆటో ఎక్స్ పో 2018లో ఈ బైక్ ను ప్రదర్శించింది కంపెనీ. దీనికి గోల్డ్ వింగ్ గా నామకరణం చేసింది.

గోల్డ్ వింగ్ బైక్ స్పెషాలిటీలు :

… ఇంజిన్ కెపాసిటీ 1833CC హార్స్ పవర్. ఇరు సిలిండర్ల ఇంజిన్ ఈ బైక్ ప్రత్యేకత. అల్యూమినియంతో తయారు చేశారు.

… మొత్తం 7 గేర్లు ఉంటాయి. ఇందులో ఆరు ముందుకు.. ఒకటి వెనక్కి ఉంటుంది.

… రెండు క్లచ్ లు ఉంటాయి. ఆటోమేటిక్ గా పని చేస్తాయి.

…  యాపిల్ ప్లే కార్ టెక్నాలజీ ఉంది ఈ బైక్ లో. ఐఫోన్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మ్యాప్స్, మ్యూజిక్ తోపాటు కాంటాక్ట్స్ లిస్ట్ కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే ద్వారా ఎంత స్పీడ్ లో ఉన్నా స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు వాయిస్ ఇంటరాక్ట్ ద్వారా సమాచారాన్ని చెబుతుంది.

… ఎయిర్ బ్యాగ్ ఈ బైక్ స్పెషాలిటీ. ఏదైనా యాక్సిడెంట్ అయినా లేక బైక్ కింద పడినా వెంటనే నాలుగు వైపుల నుంచి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి.

… గాలి వేగం, దిశను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ స్పీడ్ కంట్రోల్ చేస్తోంది.

… ఇండియాలో హోండా గోల్డ్ వింగ్ బైక్ ధర అక్షరాల రూ.32 లక్షలు.

Posted in Uncategorized

Latest Updates