హోంశాఖలో ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

tspsc0130తెలంగాణ రాష్ట్ర హోంశాఖలో 499 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హోంశాఖలో 368 జూనియర్ అసిస్టెంట్లు, 89 టైపిస్టు, 29 జూనియర్ స్టెనో, 12 సీనియర్ స్టెనో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా పశుసంవర్థక శాఖలో నాలుగు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. వీటిలో రెండు టెక్నికల్ అసిస్టెంట్లు, రెండు అసోసియేట్ పోస్టులున్నాయి. రెండు శాఖల్లోని పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates