హోంసిక్ అంట : కేంద్ర ఆర్థిక సలహాదారు రాజీనామా

ARAచీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) పదవికి అరవింద్ సుబ్రమణ్యన్ రాజీనామా చేయబోతున్నట్లు బుధవారం(జూన్-20) తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. కుటుంబపరమైన కారణాల వల్ల ఆయన తిరిగి అమెరికా వెళ్లనున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. నాలుగేళ్లుగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా సేవలందించిన అరవింద్ కు ధన్యవాదాలు తెలిపారు అరుణ్ జైట్లీ. అరవింద్ సుబ్రమణ్యన్ సాధించిన విజయాలను ఆయన కొనియాడారు.

ధనవంతులకు సబ్సీడీల తొలగింపు, యూనివర్శల్ బేసిక్ ఇన్ కమ్, క్లైమాట్ ఛేంజ్, నాలుగుC లు వంటి అంశాల్లో ఆయన సలహాలు అద్భుతమైనవని జైట్లీ తెలిపారు. 16 అక్టోబర్, 2014 న అరవింద్ సుబ్రమణ్యన్ CEA పదవిని చేపట్టినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. మూడు సంవత్సరాల పదవీకాలం ముగిసిన తర్వాత మరికొంతకాలం పదవిలో కొనసాగవలసిందిగా ఆయనను తాను కోరినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఫ్యామిలీ కమిట్ మెంట్స్ వల్ల ఈ పదవికి రాజీనామా చేసి తిరిగి అమెరికా వెళ్లిపోవాలనుకుంటున్నట్లు ఇటీవల జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ తో తనతో చెప్పారని అరుణ్ జైట్లీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates