హోటల్ లో గొడవ..కేరళ హీరోయిన్ పై ఫిర్యాదు

కేరళ హీరోయిన్ మంజు సవేకర్ కు చేదు అనుభవం ఎదురైంది.  సహనం కోల్పోయినందుకు పోలీసులతో క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. చిన్న తప్పిదానికి చివరకు సారీ చెప్పి వెళ్లింది. కేరళలోని  నాగర్‌ కోవిల్‌ పరిసర ప్రాంతాల్లో ఓ మలయాళ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది మంజు సవేకర్. షూటింగ్ సందర్భంగా మంజుకి ఓ హాటల్ లో బస ఏర్పాట్లు చేశారు.

బుధవారం అర్ధరాత్రి మంజు సవేకర్‌ షూటిం గ్‌ ముగించుకుని, హోటల్‌ లోని తన రూమ్ కి వెళ్లగా.. గది క్లీన్‌ గా లేదని.. ఆ హోటల్‌ సిబ్బందిపై సీరియస్ అయ్యింది. గట్టిగా తిట్లపురాణం తగిలించుకోవడంతో..అది తట్టుకోలేని రూమ్ బాయ్ ఆమెపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి, హీరోయిన్ మంజు సవేకర్‌ కు, హాటల్ స్టాఫ్ మధ్య గొడవను సర్ది చెప్పి సమస్యను పరిష్కరించారు. చివరకు రూమ్ బాయ్ కి హీరోయిన్ సారీ చెప్పి ఏడుస్తూ వెళ్లిపోయిందని తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates