హోదాపై మోడీ మాట్లాడకపోవడం బాధాకరం: ఏపీ సీఎం


ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయమని అడిగితే.. ప్రధాని మోడీ తనపై ఎదురుదాడి చేశారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.  నీతి, ధర్మం తప్పారు కాబట్టే అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలు పరిష్కరించేది పోయి.. రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. ప్రధాని మోడీ మాట్లాడిన తీరు అహంకార పూరితంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజిందన్న మోడీ.. నాలుగేళ్లలో ఏపీకి ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రధానిస్థాయి వ్యక్తి మాట్లాడే మాటాలా ఇవి అని ప్రశ్నించారు. చివరి అస్త్రంగా అవిశ్వాసం ప్రవేశపెట్టినట్లు చెప్పారు బాబు.

జగన్, పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు బాబు. టీడీపీ ఎంపీలు మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్నప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రజాసొమ్మును కాజేసి ఒకరు కోర్టుకెళ్తే.. మరొకరు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని సెటైర్లు వేశారు.

అసలు సమస్యను ప్రధాని పక్కదోవ పట్టించారన్నారు టీడీపీ ఎంపీలు. స్టేటస్ ఇచ్చేందుకు ఉన్న ఇబ్బందులేంటో మోడీ చెప్పలేకపోయారన్నారు. ప్రధాని ప్రసంగం ఎలక్షన్ స్పీచ్ లాగా కొనసాగిందన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు ఎంపీలు. అవిశ్వాసాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో తప్పుకుంటే నాలుగేళ్ల నుంచి మోడీ ఏం చేశారని ప్రశ్నించారు చంద్రబాబు.

Posted in Uncategorized

Latest Updates