హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం

 కర్నూలు : కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశారు. నంద్యాల కోర్టు ఆవరణలో లాయర్‌‌ అనిల్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడున్నవారు అనిల్‌ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశారు లాయర్ అనిల్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ లాయర్ నుదుటిపై రాసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest Updates