హోదా కోసం విజయవాడలో పాదయాత్ర చేస్తా : పవన్

PawankalyanPadayatraapril6ఏప్రిల్  6న  విజయవాడలో పాదయాత్ర చేస్తానని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా పోరాటానికి సంబంధించి బుధవారం (ఏప్రిల్-4) వామపక్ష నేతలతో భేటీ అయ్యారు పవన్. విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఏప్రిల్ 6న జాతీయ రహదారులు లేని చోట, ముఖ్య కూడళ్లలో పాదయాత్రలు చేస్తామని ప్రకటించారు.

TDP,  YCP పరస్పర ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాయని పవన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేసిందన్నారు. ఇక సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ సమస్య జాతీయ సమస్యగా మారిందని చెప్పారు. అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలుంటే రాష్ట్రంలో మాట్లాడుకోవాలని.. ఢిల్లీలో మాటలయుద్దం మంచిది కాదన్నారు.

Posted in Uncategorized

Latest Updates