హోదా కోసం : వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా

Sumitra-Mahajan-ycpఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎంపీలు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్ లోని ఈ లేఖలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు స్వయంగా అంజేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ.. కేంద్రం వైఖరికి నిరసనగా.. హోదా కోరుతూ ఈ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎంపీలు. రాజీనామా చేసిన ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ రావు, మిధున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్నారు. రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా అనేది ఇంకా ప్రకటించలేదు పార్టీ.

ఎంపీలు అందించిన రాజీనామాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటీ అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates