హోదా డిమాండ్ : ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీల రాజీనామా

jaganbandhప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్. ఏప్రిల్ 5వ తేదీలోపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. ఇవ్వకపోతే.. ఏప్రిల్ 6వ తేదీన ఢిల్లీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు జగన్. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రత్యేక హోదా మా హక్కు – ప్యాకేజీతో మోసం చేయొద్దు అనే డిమాండ్ తో మార్చి ఒకటో తేదీన అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయనున్నట్లు తెలిపారు. మార్చి 5వ తేదీన ఢిల్లీలో ధర్నా కోసం ఎంపీలు అందరూ కలిసి వెళతారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పాల్గొంటారని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తారన్నారు. ఏప్రిల్ 6వ తేదీ పార్లమెంట్ చివరి రోజున కూడా హోదా రాకపోతే.. అదే రోజు రాజీనామా చేస్తారని ఉద్యమ షెడ్యూల్ ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates