హౌరా బ్రిడ్జికి 75ఏళ్ళు

howra-bridgeకోల్‌కతా నగరానికి తలమానికం హౌరా బ్రిడ్. హుగ్లీ నదిపై నిర్మించిన ఆ బ్రిడ్జినే కోల్‌కతా-హౌరా నగరాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీ వరకు 75 ఏళ్ళయింది. ఈ సందర్భంగా బ్రిడ్జిని సుందరంగా మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆ బ్రిడ్జికి ఉన్న ప్రత్యేకతను చాటారు.

ఉక్కుతో నిర్మించిన ఈ బ్రిడ్జి మొత్తం 705 మీటర్లు..ఎత్తు 82 అడుగులు. 1936లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించగా.. 1942లో పూర్తి అయింది. 1943, ఫిబ్రవరి 3న ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో జూన్ 14, 1965న ఆయనకు గౌరవ సూచకంగా రవీంద్ర సేతు అని ఈ బ్రిడ్జికి నామకరణం చేశారు.

Posted in Uncategorized

Latest Updates