హౌస్ పుల్ : హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ముంబై పుట్ బాల్ మ్యాచ్ టిక్కెట్లు

chatriమమ్మల్ని తిట్టండి, విమర్శించండి.. కానీ స్టేడియానికి వచ్చి మా ఆట చూడండి అంటూ భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చెత్రీ విజ్ణప్తితో ముంబై స్టేడియంలో సోమవారం(జూన్-4) భారత్-కెన్యాల మధ్య జరిగే ఇంటర్నేషనల్ కప్ పుట్ బాల్ మ్యాచ్ టికెట్టు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. 15 వేల సీటింగ్ సామర్ధ్యం గల స్టేడియం టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.

ఫుట్ బాల్ లవర్స్ అందరూ స్టేడియాలకు వచ్చి భారత జట్టు ఆడుతున్న మ్యాచ్ లు ప్రత్యక్షంగా చూడాలనిభారత్ ఫుల్ బాట్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్ స్థాయిల్లో కాకపోయినా.. ప్రేక్షకులను అలరించేందుకు కష్టపడతామన్నాడు చెత్రి.

చెత్రికి మద్దతుగా నిలిచాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్. స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లను చూడాలని ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేశాడు. దేశం తరపున ప్రాతనిధ్యం వహిస్తున్న ప్లేయర్లకు సపోర్టివ్వాలన్నాడు. అథ్లెట్లను ప్రోత్సహించాలంటూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశాడు సచిన్.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెంచాలన్నాడు కోహ్లీ. సునీల్ చెత్రీకి సపోర్టుగా వీడియోను పోస్ట్ చేశాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చెత్రి ట్వీట్ కు స్పందించారు. త్వరలోనే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నానని చెప్పారు. చెత్రి వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్.. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయాలని సూచించారు. మరోవైపు సునీల్ చెత్రి కూడా మళ్లీ రియాక్ట్ అయ్యాడు. వీడియోలో చెప్పిన మాటలు తన మనసులోంచి వచ్చాయన్నాడు.

ప్రస్తుతం భారత ఫుట్ బాల్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్ లో 97వ స్థానంలో ఉంది. నాలుగు దేశాల టోర్నీ ముంబైలో ప్రారంభం కాగా… 5-0తో చైనీస్ తైపీపై భారత్ గెలిచింది. చెత్రీ హ్యాట్రిక్ గోల్స్ తో జట్టును గెలిపించినా… గ్రౌండ్ లో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో బాధపడ్డాడు చెత్రి. మ్యాచ్ కు 2వేల 500 మంది మాత్రమే హాజరుకావడంతో సోషల్ మీడియాలో బాధను పంచుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates