హ్యాక్ అయిన సుప్రీంకోర్టు వెబ్ సైట్

kతమ వెబ్ సైట్ హ్యాక్ అయ్యిందని ఇప్పటి వరకు కొందరు ప్రముఖులు, కొన్ని సంస్థలు ఆరోపించాయి. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది.దాదాపు అరగంట పైగా క్రాష్‌ అయ్యింది. జస్టిస్‌ బీహెచ్‌ లోయా కేసుపై ఉత్తర్వులు వెలువరించిన తర్వాత సుప్రీం కోర్ట్‌ వెబ్‌సైట్‌ గురువారం(ఏప్రిల్-19) మధ్యాహ్నం అరగంట పాటు హ్యాక్‌ అయింది. వెబ్‌సైట్‌ అందుబాటులో లేకపోవడంతో టెక్నినికల్ టీం హ్యాకింగ్‌ ప్రయత్నం జరిగిందని గుర్తించి భద్రతా చర్య కింద కొద్దిసేపు సైట్‌ను నిలిపివేసింది. వెబ్‌సైట్‌ నిలిచిపోవడాన్ని సుప్రీం కోర్టు నిర్ధారించింది. పదిహేను రోజుల కిందట పలు ప్రభుత్వ వెబ్‌సైట్‌ల సేవలు నిలిచిపోవడంతో దీని వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉందంటూ ప్రచారం జరిగింది.

సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడికి పాల్పడ్డం నిజ‌మేన‌ని కేంద్ర స‌మాచార శాఖ తెలిపింది. వెబ్ సైట్ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయంది. వెబ్ సైట్ హ్యాకింగ్‌కి గురైందని చెబుతూ హ్యాకర్లు ఆకు ఆకారంలో ఓ లోగోను పోస్టు చేసినట్టు చేశారు. హైటెక్ బ్రెజిల్ హ్యాక్ టీమ్‌గా చెప్పుకుంటున్న సైబర్ ముఠా వెబ్‌సైట్‌ను పట్టుకునేందుకు  ప్రయత్నించినట్టు సమచారం.

Posted in Uncategorized

Latest Updates