హ్యాట్సాఫ్ కలెక్టరమ్మ : తన ఆలోచనతో జిల్లాను క్లీన్ సిటీగా మార్చింది

గాంధీ జయంతి సదర్భంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు పరిశుభ్రత గురించి గుర్తు చేసుకున్న రాజకీయనాయకులు..కొన్నిచోట్ల పరిశుభ్రతను పాటించారు. ఇందులో భాగంగానే పుదుచ్చెరి సీఎం వి.నారాయణ స్వామి మురికి కాల్వలోకి దిగి చెత్తను క్లీన్ చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీ భోజనం చేసిన ప్లేట్లను కడిగి..అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగానే స్వచ్ఛభారత్, స్వచ్ఛత హీసేవ లాంటి కార్యక్రమాలు దేశంలో నిర్వహిస్తున్నారు. పరిశుభ్రతపై దేశ ప్రజలకు అవేర్ నెస్ రావాలని ప్రభుత్వ యాడ్స్ కూడా ఇస్తున్నారు. అయితే వీటికి భిన్నంగా ఆలోచించారు ఛత్తీస్ గడ్ కు చెందిన IAS అధికారిని రితుసైన్.

క్లీనింగ్ కు ..క్లీనింగ్..డబ్బుకు ..డబ్బు

ఛత్తీస్ గడ్ లోని సర్జుజా జిల్లాకు చెందిన రితుసైన్ 2003 బ్యాచ్ కి చెందిన IAS ఆఫీసర్. 2016లో ఆమె ఛత్తీస్ గడ్ జిల్లాలోని అంబికాపూర్ జిల్లాకు కలెక్టర్ గా సెలక్ట అయ్యారు. జిల్లాకు వెళ్తూనే ఆమెకు చెత్త కుప్పలు స్వాగతం పలికాయి. వెంటనే ఆమె మనసులో తట్టిలేపిన ఆలోచన ఒక్కటే. ఫస్ట్ జిల్లాను క్లీన్ గా చేయాలి.  లక్షా 45 వేల పాపులేషన్ ఉన్న స్మాల్ అంబికాపూర్ ను క్లీన్ సిటీగా మార్చాలనుకున్నారు. జిల్లాలో క్లీనింగ్ పై ఎన్నో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించారు. అసలే చిన్న జిల్లా..నిధులు తక్కువగా వస్తాయి. కానీ..అభివృద్ధి చేయాల్సింది చాలా. దీంతో పరిస్థితిపై ప్రజల్లో అవగాహన ఒక్కటే మార్గం అని కంకణం కట్టుకున్నారు, క్లీనింగ్ పై ఓ సవాల్ గా పని చేశారు. ఎక్కడ చెత్త కనిపించిన తాను తీస్తూ..పక్కన ఉన్నవాళ్లకు తీయాలని చెప్పడం మొదలుపెట్టారు.

క్లీన్ సిటీగా అవార్డ్

దీంతోపాటు చెత్త సేకరణ చేపడుతూ ఎందరో మహిళలకు ఉపాధిని కల్పించారు. తడిచెత్త..పొడిచెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించేది. చెత్తతో గ్యాస్, రోడ్లకు అవసరమయ్యే విడి చెత్తను ఎవరికి వారు వేరు చేసేవారు. ఇందుకోసం జిల్లాలోని మహిళా సంఘాల్లో అవేర్ నెస్ కార్యక్రమాలను నిర్వహించింది కలెక్టర్ రితుసైన్. చెత్తలో ఎలాంటి అవసరంలేని పేపర్..ఇనుప వస్తువలను స్క్రాప్ కంపెనీలకు అమ్మేయాలనే ఆలోచనలను మహిళలకు వివరించింది. ఈ ఆలోచనతో జిల్లా క్లీన్ కావడంతో పాటు..ఎంతో మంది మహిళలకు ఉపాధి లభించింది. 2018 సంవత్సరంలో దేశంలోనే స్మాల్ క్లీన్ సిటీగా అంబికాపూర్ కు నేషనల్ అవార్డు వచ్చింది.

దేశం మెచ్చిన కలెక్టరమ్మ

కలెక్టర్ అంటే క్లీనింగ్ అనేలా పేరు సంపాధించుకున్నారు. స్వచ్ఛతకే మారు పేరులా మారిపోయారు. ప్రస్తుతం ఈ జిల్లాలో ఎక్కడ చూసినా పరిసరాలు క్లీన్ గా కనిపిస్తుండటంతో కలెక్టరమ్మ కృషి ఫలించిందంటూ కొనియాడుతున్నారు ఉన్నతాధికారులు. మంగళవారం (అక్టోబర్-2)న గాంధీ జయంతి సందర్బంగా జిల్లాను క్లీన్ సిటీగా తయారుచేసిన ఈ యంగ్ డైనమిక్ కలెక్టరమ్మ రితుసైన్ ను గుర్తు చేస్తూ దేశం గర్వించింది. అందరికీ ఇలాంటి ఆలోచన వచ్చి, దాన్ని ఆచరించినప్పుడే మహాత్మడికిచ్చే నిజమైన నివాళి. హ్యాట్సాఫ్ రితుసైన్.

Posted in Uncategorized

Latest Updates