హ్యాపీ చాక్లెట్ డే : ఇష్టపడని వారు ఎవరుంటారు

chocoloteaచాక్లెట్.. ఈ మాట వినగానే నోరు ఊరుతుంది.. తినాలనే కోరిక పుడుతుంది. హ్యాపీ మూమెంట్ ఏదైనా.. సెలబ్రేషన్ ఏదైనా సరే చాక్లెట్ ఉండాల్సిందే. చిన్న పిల్లలకు చాక్లెట్ అంటే ప్రాణం.. అంతెందుకు చాక్లెట్ ఇష్టపడని పెద్దలు మాత్రం ఉంటారా ఏంటీ.. రకరకాల పేర్లు.. రుచులతో మార్కెట్లోకి వస్తున్న చాక్లెట్లను చప్పరించని వారు ఎవరుంటారు. చాక్లెట్ల కోసం ప్రత్యేకంగా షాపింగ్ చేసేవారు ఎందరో.. అంతటి క్రేజ్ ఉంది చాక్లెట్లకు. ప్రతీ  ఏటా జులై 7వ తేదీని వరల్డ్ చాక్లెట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది ప్రపంచం. ఆ రోజు ఇవాళ వచ్చేసింది. మనం కూడా హ్యాపీ చాక్లెట్ డే చెప్పేద్దాం..

ప్రపంచంలోనే చాక్లెట్స్ యమ గిరాకీ. కేకులు కూడా చాక్లెట్ ప్లేవర్స్ లో వచ్చేస్తున్నాయి. దేశంలోనూ వీటికి విపరీతమైన ప్రియులు ఉన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ కు చాక్లెట్స్ లో ప్రత్యేక స్థానం ఉంది. అది ఏంటో తెలుసా.. చాక్లెట్లు తినటంలో మన హైదరాబాదీలు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో ఉంది. మన తర్వాతే ముంబై, చెన్నై నగరాలు.

ఒకప్పుడు రాపర్లలోచుట్టిన చిన్న చిన్న చాక్లెట్లు వచ్చేవి.. ఆ తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్లు. ఇప్పుడు సిల్క్ చాక్లెట్స్. కాలంతోపాటు ప్లేవర్లు పుట్టుకొచ్చేశాయి. లవర్స్ అయితే చాక్లెట్ లేనిదే ఆ రోజు వెలితిగా ఉంటుంది. ఇద్దరూ మిట్ అయిన ప్రతిసారీ చాక్లెట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. అంతే కాదు.. గిఫ్ట్ ప్యాక్స్ కూడా వచ్చేశాయి. స్పెషల్ గా చాక్లెట్ హట్.. చాకో హబ్ పేర్లతో రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. వాటిని కొనేందుకు చాక్లెట్ ప్రియులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వీటి కోసం నేరుగా కాకుండా ఆన్ లైన్లో కూడా ఆర్డర్స్ చేస్తున్నారు. డిన్నర్, స్నాక్స్ తీసుకున్న తర్వాత చాక్లెట్లు తినేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి సందర్భమేదైనా… చాక్లెట్ తప్పని సరి అంటోంది నేటి యూత్.

Posted in Uncategorized

Latest Updates