హ్యాపీ ఫాదర్స్ డే

happy-fathers-dayఅమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం.బిడ్డ పుట్టుకకు హేతువై విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధికోసం ఎప్పుడూ శ్రమించే సైనికుడే నాన్న. తనకంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగాఇచ్చి ఎత్తుకి ఎదగాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం గలవాడు నాన్న.నాన్నంటే భరోసా… నాన్నంటే భద్రత.. నాన్నంటే బాధ్యత.మొత్తానికి నాన్న అనే పదానికి నిర్వచనం కావాలంటే కేవలం గుండెనడిగితే సరిపోదు. అంతులేని విశ్వం మొత్తాన్ని శోధించాలి. అంతటి త్యాగానికి గుర్తుగా వరల్డ్ వైడ్ గా జూన్ 17న ఫాదర్స్ డే జరుపుకుంటారు.

చిన్నప్పుడు మనల్ని పైకెగరేసి అందుకున్న జ్ఞాపకాలను తడిమి చూసుకుంటే అట్టడుక్కి జారిపోయిన ధైర్యం.. గుండెలోకి ఎగదన్నుకొస్తుంది. అందుకే నాన్నంటే అంతులేని భరోసా. సుఖమనే పదం మర్చిపోయిన త్యాగశీలి నాన్న. తండ్రి తొలి గురువే కాదు మలి గురువు కూడా. ఆయన భుజాలపై కూర్చునే కదా అందమైన ప్రపంచాన్ని చూశాం. ఆయన వేలు పట్టుకునే కదా ఈ లోకంలో నడిచాం. అందుకే నాన్న తొలిగురువు, మలిగురువు. నాన్న అన్నీ తెలిసిన హీరో. కూతురు ఇంజక్షన్ అంటే భయపడ్డప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి నాన్న ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే నాన్న మరపురాని జ్ఞాపకం.అప్పుడప్పుడు వంటింట్లో అమ్మలా మారిపోతాడు. కొడుకు బైక్ రిపేర్ చేస్తూ మెకానిక్ అవతారమెత్తుతాడు. లోకంలో ఎలా మసలుకోవాలో కూతురికి చెప్తూ దార్శనికుడు అవుతాడు. నాన్నంటే స్నేహితుడు. నాన్నంటే రక్షకుడు.

చిన్నప్పుడు నాన్న కాళ్లు చుట్టేసిన జ్ఞాపకం. ఆయన ఛాతి మీద వాలిపోయిన జ్ఞాపకం. ఆయన వీపు మీద చెయ్యి వేసి నడిచిన జ్ఞాపకం. ఇలా మమతల పందిరి కింద నాన్న కోసం ఎన్నెన్ని జ్ఞాపకాలని. మీసాల్లో తెల్ల వెంట్రుకలు వచ్చినా ఇంకా పిల్లల దృష్టిలో హీరోనే. అతనెప్పటికీ హీరోనే. రెక్కలు ముక్కలు చేసుకొని బతుకునంతా ధారపోసి బిడ్డల్ని సాకే నాన్నలంతా వర్ధిల్లాలి….హ్యాపీ ఫాదర్స్ డే.

Posted in Uncategorized

Latest Updates