హ్యాపీ బర్త్ డే రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్… ఇవాళ్టి (డిసెంబరు 12)తో 69 ఏటలోకి అడుగుపెట్టారు. సినిమా హీరోగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఓ సామాన్యుడిగానే కనిపిస్తారు రజినీకాంత్. బస్సు టిక్కెట్టు కొట్టి పొట్ట పోసుకునే ఓ  అత్యంత సాధారణ ఉద్యోగి…కట్ చేస్తే కోట్లాది భారతీయుల హృదయాలను కొల్లగొట్టే హీరో అయ్యాడు. బూతద్దం పెట్టి వెతికినా హీరోయిజం తాలూకు లక్షణాలు మచ్చుకైనా కన్పించని ఓ సామాన్యుడు..వెండితెర వేల్పుగా వెలిగిపోయాడు.

తలైవర్ రజినీ కాంత్ కు ఊరికే స్టార్ డమ్ రాలేదు. ఒక్కో మెట్టు..ఒక్కోవిజయం..ఒక్కో మలుపును అధిగమిస్తూ… రజినీ మన మనిషిగా…మనలో మనిషిగా మన మనసుల్లో నిలిచిపోయాడు. పిచ్చెక్కించే స్టైల్స్ తో…మతులు పోగొట్టే రజినీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కాకా నువు కేక అనాల్సిందే. రజినీకాంత్ … ఈ పేరులో సూపర్ పవర్ ఉంది. ఇండియాలో ఎంతోమంది కండలవీరులున్నారు. మరెంతో మంది అందమైన హీరోలూ ఉన్నారు. రజినీ వారందరికన్నా భిన్నం. వేరెవరికీ లేని క్రేజ్ ను సంపాదించారు. నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతూ.. ఇప్పటికీ ఇంచ్ క్రేజ్ తగ్గని ఎవర్ గ్రీన్ యాంగ్రీ యంగ్ హీరో రజినీ. తన మార్క్  స్టైల్స్ , డైలాగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ శివాజీ ఒక్క డైలాగ్ చెబితే వందసార్లు చప్పట్లు కొట్టాల్సిందే. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ … ఇలా భాషలతో సంబంధం లేకుండా అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. తన మార్క్ స్టైల్స్ తో ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తున్నారు. 68 ఏళ్లు దాటినా ఇప్పటికీ వెండితెరపై నవ యుకుడిలా కనిపించడం ఒక్క రజినీకే సాధ్యమైంది.

1950 డిసెంబర్ 12 న కర్ణాటకలో రామోజీరావ్ గైక్వాడ్ , జిజియా బాయ్ దంతపులకు జన్మించారు రజినీ. అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆర్టీసీ కండాక్టర్ గా పనిచేసిన సూపర్ స్టార్ … తన స్నేహితుడు తోటి డ్రైవర్ సాయంతో మద్రాస్ ఫిల్మ్  ఇనిస్టిట్యూట్ లో చేరారు. అక్కడే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దృష్టిలో పడ్డారు. అపురూప రాగంగల్ సినిమాతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కేరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ పాత్రల్లో కనిపించారు. ముత్తు రామన్ డైరెక్షన్ లో వచ్చిన భువన ఓరు కల్వికరు చిత్రం రజినీకాంత్ ను హీరోగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. దక్షిణ భారతదేశ సినిమాలతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ , జపాన్ ,జర్మనీ భాషల్లో నటించారు. తెలుగులో భాషా, ముత్తు, నరసింహా, శివాజీ, చంద్రముఖి, రోబో .. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్ లో కనిపించారు రజినీ. ఎప్పటికప్పుడు న్యూ లుక్కుతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. లేటెస్ట్ గా రిలీజైన 2.ఓ రికార్డులు బ్రేక్ చేస్తోంది.

ఆయన పుట్టినరోజు అంటే తమిళనాడులో ఆయన అభిమానులు పెద్దఎత్తున పండుగలా చేస్తారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పుట్టినరోజు వేడుకలు చేసుకోలేనని, తనకు అలాంటి ఉత్సవాలు ఏమీ జరుపవద్దని అభిమానులకు పిలుపునిచ్చారు. రజినీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా విషెస్ తెలుపుతున్నారు. అభిమానులతో పాటు సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు రజినీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌ లతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌, త్రిష, సుశాంత్‌, కస్తూరి లాంటి సినీ తారలు, నిర్మాణ సంస్థలు దర్శకులు తలైవాకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates