హ్యాపీ బర్త్ డే వెంకీ

వైవిద్యభరితమైన సినిమాలతో, ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు తీస్తున్న హీరో వెంకటేష్. సక్సెస్ ఫుల్ సినిమాలతో  విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఈ హీరో పుట్టినరోజు నేడు. 1960 డిసెంబర్ 13జన్మించిన వెంకి 1986లో ‘కలియుగపాండవులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెంకీ వెనక్కి చూడకుండా ఎన్నో సూపర్ హిట్స్ తో దూసుకుపోయారు. ఆయన నటించిన ఎక్కువ సినిమాలు ఫ్యామిలీని ఆకట్టుకుంటాయి. ఎన్నో సినిమాలకు అవార్డులు, రివార్డులు అందుకున్న వెంకీ..ప్రస్తుత హీరోల్లో బెస్ట్ యాక్టర్ గా ఐదు నంది అవార్డులు అందుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది. “1.ప్రేమ, 2.ధర్మచక్రం, 3.గణేష్, 4.కలిసుందాం..రా, 5.ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” సినిమాలకు గాను వెంకీ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు.

“కలిసుందాం రా.., నువ్వునాకు నచ్చావ్, ఆడవారి మాటలకు అర్దాలేవేరులే”  లాంటి ఫ్యామిలీ సినిమాలే కాకుండా.. “శత్రువు, బొబ్బిలిరాజా, క్షణం క్షణం ఘర్షణ” లాంటి యాక్షన్..” ప్రేమ, ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, ప్రేమతో.. రా” లాంటి లవ్ స్టోరీలతో తిరుగులేని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు వెంకటేష్. ఆయన ఫ్యామిలీ విషయానికొస్తే మూవీ మోఘల్ రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకీ..1985 డిసెంబర్ 13న నీరజను పెళ్లి చేసుకున్నారు. ఇంకో విషయం ఏమిటంటే వెరైటీగా ఆయన బర్త్ డే రోజునే (డిసెంబర్ -13 )మ్యారేజ్ చేసుకున్న వెంకీకి ముగ్గురు కూతుళ్లు, కొడుకు. ఇలా ఏం చేసినా వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకునే వెంకీ..సినిమాల ఎంపికలోనూ సక్సెస్ అయ్యారు.

సినిమా ఇండస్ట్రీ బాగుండాలనే ఉద్దేశ్యంతో అప్పుడప్పుడు ఎక్కువ బడ్జెట్ లేని.. “ఈనాడు, దృశ్యం, గురు” లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఇవే కాకుండా రీమేక్ సినిమాలను తీయడంలో వెంకీ దిట్ట. ఎన్నో బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి రీమేక్ హీరో అనిపించుకున్నారు వెంకీ. ఎప్పుడో ANR, NTR, శోభన్ బాబు తర్వాత కనుమరుగైపోయిన మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబుతో “సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు” సినిమాతో మళ్లీ మల్టీస్టారర్ సినిమాలకు ప్రాణం పోసిన వెంకీ..ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో “మసాలా”, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో “గోపాలా గోపాలా” వంటి సినిమాల్లో దైర్యంగా నటించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ తో నటిస్తున్న F2 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. మరిన్ని ఫ్యామిలో స్టోరీస్ లో నటించాలను కోరుతూ.. విక్టరీ వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

 

Posted in Uncategorized

Latest Updates