హ్యాపీ వెడ్డింగ్ : అబ్బాయ్ ..పిల్ల సూపర్

happyరెండురోజులుగా నిహారిక కొణిదెల వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో నిహారిక కోత్త సినిమా ప్రమోషన్ కోసమే ఇలా వైరటీగా చేసింది యూనిట్. లక్ష్మణ్ డైరెక్షన్ లో సుమంత్ అశ్విన్, నిహారిక నటించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్.  ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నిహారిక వెడ్డింగ్ వీడియోను రిలీజ్ చేసిన యూనిట్..శనివారం (జూన్-30) ట్రైలర్ ను రిలీజ్ చేసింది.  యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ లో ..ఓ పెళ్లి నిశ్చయమైన తర్వాత జరిగే తంతు చూపించారు. పెళ్లి తేదీ దగ్గర పడేలోపు ప్రేమలో పడ్డ నిహారిక, సుమంత్‌ల మధ్య చిన్న చిన్న కలహాలు మొదలైనట్లు ట్రలర్‌ ను బట్టి తెలుస్తోంది.

మాకు బంధువులు ఎక్కువేగానీ పనులకు ఎవరూ రారు అని ఒకరంటుంటే మీరు కంగారు పడకండి వదినా.. అందరం కలిసి కట్టుగా ఈ పెళ్లి చేద్దాం అనే డైలాగ్‌ తో ట్రైలర్‌ ప్రారంభమైంది. మా మనవడికి పెళ్లి కుదిరిపోయింది అబ్బాయ్‌.. పిల్ల సూపర్‌ అంటూ నిహారికను పొగిడేశారు అన్నపూర్ణ. మీ అబ్బాయిలంతా ఇంతేనా.. మేం కన్‌ ఫాం చేయగానే ఎందుకు మీలో అంత మార్పు అంటూ నిహారిక తనకు కాబోయే భర్తను కోపంగా నిలదీస్తున్నారు.

ఒక అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులను వదిలి.. పరాయి ఇంటికి వెళ్లి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించు అని హీరోయిన్ అంటుంటే యే.. మా అబ్బాయిలకు ఎటువంటి టెన్షన్స్‌ ఉండవు అనుకుంటున్నావా.. ఎటువంటి అమ్మాయి మా ఇంటికి వస్తుంది మాతో సర్దుకుపోతుందో, లేదో, మాలో ఇమిడిపోతుందా, లేదా.. మంచిదా, చెడ్డదా ..లేక నీలా పిచ్చిదా’ అంటూ హీరో అరిచాడు. చివరగా నటుడు నరేష్‌‌ తన కుమారుడు సుమంత్‌ కు ఆడవాళ్ల మనసు గురించి చెబుతూ.. వాళ్లు ఎవరనుకుంటున్నావురా, అమ్మాయిలురా’ అనే డైలాగ్‌ హైలైట్‌ గా నిలిచింది.

Posted in Uncategorized

Latest Updates