‘హ్యాపీ వెడ్డింగ్’ ఫ‌స్ట్ ఇన్విటేష‌న్

haoppyమెగా ఫ్యామిలీ గారాల ప‌ట్టి నిహారిక లేటెస్టుగా నటించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్ర టీం టీజ‌ర్ ను విడుదల చేసింది ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు… ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్మ‌, పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రంతో ఆక‌ట్టుకున్న ఈ అమ్మ‌డు మెగా హీరోయిన్‌గా అభిమానుల మ‌న‌సులు దోచుకుంది. సినిమా ట్రైల‌ర్ జూన్ 30 ఉద‌యం 10.36ని.ల‌కి విడుద‌ల కానుంది. మూవీ రిలీజ్ డేట్ కూడా అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది చిత్ర యూనిట్‌.

Posted in Uncategorized

Latest Updates