హ్యూమన్‌ ఉబెర్‌ టెక్నాలజీ : అటు నువ్వే ..ఇటు నువ్వే

saపెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసిందంటే చాలు.. ఒకే రోజు చాలా మంది పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. మనకు తెలిసిన వారివి, ఫ్రెండ్స్‌ పెళ్లిళ్లు చాలానే ఉంటాయి. మరి ఒకే రోజు అన్ని పెళ్లిళ్లకు వెళ్లడం ఎలా.. పెళ్లి వేదికలు మనకు దగ్గరగా ఉంటే కష్టపడి మహా అయితే రెండు పెళ్లిళ్లకు అటెండ్‌ అవొచ్చు. మరి మిగతా వాటి సంగతి.. మరేం పర్లేదు.. వాటికి కూడా మీరు హాజరయ్యేలా మేం చూసుకుంటాం అంటోంది ఉబెర్‌. ఉబెర్‌ అంటే కార్లను అద్దెకిచ్చే కంపెనీ కదా.. మరి కొత్తగా ఈ పెళ్లిళ్ల గోల ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది మీరనుకుంటున్న ఉబెర్‌ కాదు.. హ్యూమన్‌ ఉబెర్‌ అనే కొత్త టెక్నాలజీ. అంటే ఇందులో మనకు బదులు వేరే వ్యక్తిని ఫంక్షన్లకు హాజరయ్యేలా చూస్తుంది.. అంటే మీకు ప్రతినిధిగా అన్నమాట. కాకపోతే మన ముఖంపెట్టుకునే మన ప్రతినిధి వెళ్తాడట.

జపాన్‌కు చెందిన జున్‌ రెకిమొటో అనే పరిశోధకుడు తన కొత్త ఐడియాను మన ముందుకు తీసుకొచ్చాడు. మన తరఫున ఫంక్షన్లకు వెళ్లే వ్యక్తి ముఖానికి ఓ మాస్క్‌ ధరిస్తాడట. దాని పేరు కెమీలియాన్‌ మాస్క్‌  అదేనండీ ఊసరవెల్లి ముసుగు అన్నమాట. ఈ తొడుగును ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదర్శించాడు. ఈ మాస్క్‌లో మన ముఖంతో పాటు మన గొంతు కూడా వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఫలానా ఫంక్షన్‌కు వెళ్లినపుడు ఎలా ప్రవర్తించాలి.. ఎవరితో మాట్లాడాలి.. ఏం చేయాలనే విషయాలను ముందుగానే ఆ వ్యక్తికి చెప్పేస్తే అచ్చు అలాగే నడుచుకుంటాడు. ఈ సాఫ్ట్ వేర్ తో ఎన్ని ముసుగైలైనా ఉపయోగించుకుని ఏకకాలంలో 10 అవతారలైనా ధరించి ఎన్ని ఫంక్షన్లైకైనా వెళ్లవచ్చంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates