Pushpa2FirstSingle: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..పాటల నగరా షురూ చేసిన దేవిశ్రీ ప్రసాద్

Pushpa2FirstSingle: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..పాటల నగరా షురూ చేసిన దేవిశ్రీ ప్రసాద్

స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa2TheRule). తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్ అంటూ ఉన్నఈ మాస్ బీట్కు..స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ పుష్ప రాజ్ ఫ్యాన్స్ లో పూనకాలు షురూ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రానున్నఈ పూర్తి లిరికల్ సాంగ్ మే 1న 11.07 గంటలకు రిలీజ్ కానుంది. ఈ సాంగ్ కోసం పుష్ప ఫ్యాన్స్..కళ్ళలో ఒత్తులు  వేసుకుని  వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ అయ్యాయి. దేవి శ్రీ ఇచ్చిన ట్యూన్స్ కి భాషతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేయడం..హుమ్మింగ్ చేయడం చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు పుష్ప 2 ఆగమనం మొదలవ్వడంతో..పార్ట్ 2కి సంబంధించిన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది..ఈ ఒక్క ప్రోమో చూస్తే అర్ధమైపోయి ఉంటుంది.

Also Read:“యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

అయితే పుష్ప పార్ట్ 1 కి వచ్చిన స్పందన..ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ దృష్ట్యా..పుష్ప 2 సినిమాపై మరింత బాధ్యత ఉంది మేకర్స్. కనుకే, ఈ సినిమాలో రిలీజ్ చేసే పోస్టర్ దగ్గర నుండి  టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.  

పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.ఈ మూవీ 2024 ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.

  • Beta
Beta feature