సరైన టైంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు 

సరైన టైంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు 

తెలంగాణ ప్రజల మనోభావాలకనుగుణంగా సరైన టైంలో తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజలకు, కార్యకర్తలకు పార్టీనీ ఎలా అందుబాటులో ఉంచాలనేదానిపై ఆలోచిస్తున్నాం.. త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నగర అభివృద్దిలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. 

తెలంగాణలో ఇప్పటివరకు అంతాబాగానే ఉంది.. ఏపీ మాత్రం చాలా నష్టపోయింది.. తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గాడిలో పెట్టాల్సి ఉందన్నారు చంద్రబాబు.. ప్రజల మనోభావాలనుకుణంగా తెలుగు ప్రజల ప్రయోజనం కోసం..తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు చంద్రబాబు.   

తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజలకోసం స్థాపించబడింది. ఒక ప్రాంతంకోసం.. ఓ కులం కోసం.. ఓ మతం కోసం పనిచేయదు.. తెలంగాణలో తెలుగుజాతి అగ్రజాతిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో టీడీపీ హయాంలో తెలంగాణ అభివృద్దికోసం పునాదులు పడ్డాయన్నారు. ప్రస్తుతం ఏపీ అభివృద్దిపై దృష్టి పెట్టాం.. దీంతోపాటు తెలంగాణ అభివృద్దికి కృషి చేస్తామన్నారు.