తమిళనాడు జూ: కరోనాతో మరో సింహం మృతి

తమిళనాడు జూ: కరోనాతో మరో సింహం మృతి
  • జూలో ఉన్న 11 సింహాల్లో మరో 9 సింహాలకు కరోనా నిర్ధారణ

చెన్నై: తమిళనాడులోని వండలూరు జూలో కరోనా లక్షణాలతో మరో సింహం మృతి చెందింది. బుధవారం ఉదయం 10.15 గంటల సమయంలో సింహం మృతి చెందిందని జూ అధికారులు ప్రకటించారు. ఇదే జూలో కొద్ది రోజుల క్రితం అంటే ఈనెల 3వ తేదీన తొమ్మిదేళ్ల వయసున్న మగ సింహం కరోనా లక్షణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈనెల 3వ తేదీన కరోనా లక్షణాలు కనిపించిన సింహానికి చికిత్స చేస్తుండగా ఇవాళ కన్నుమూసిందని జూ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సింహం శాంపిల్స్ సేకరించి కరోనా నిర్దారణ కోసం భోపాల్ లోని హై సెక్యూరిటీ అనిమల్ డిసీజ్ సెంటర్ కు పంపగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వారు తెలిపారు. దీంతో జూలో ఉన్న 11 సింహాల శాంపిల్స్ సేకరించి భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటి అనిమల్ డిసీజ్ సెంటర్ కు పంపగా వీటిలో 9 సింహాలకు కరోనా సోకినట్లు తేలింది.