పోలీస్ ప్రజావాణికి 27 ఫిర్యాదులు

పోలీస్ ప్రజావాణికి 27 ఫిర్యాదులు

నిజామాబాద్​, వెలుగు : జిల్లా పోలీస్​ ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 27 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య బాధితులతో స్వయంగా మాట్లాడి ఫిర్యాదులు తీసుకున్నారు. ఠాణా ఆఫీసర్లకు ఫోన్​ చేసి వారికి న్యాయం చేయాల్సిన తీరును వివరించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బాధితులు నేరుగా తనను కలువగలుగుతున్నారని అన్నారు. 

యువత సన్మార్గంలో నడవాలి 

ఆర్మూర్ :- -యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని సీపీ సాయి చైతన్య అన్నారు. సోమవారం పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్​ టౌన్​లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్​లో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ టోర్నీ  ముగియగా, సీపీ విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని క్రీడాకారులు, విద్యార్థులు చేసిన నాటిక చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​హెచ్​వో పి. సత్యనారాయణ గౌడ్ , క్రీడల కన్వీనర్ లక్ష్మీనర్సయ్య, ఎంఈవోలు పింజ రాజ గంగారం, నరేందర్ పాల్గొన్నారు.