గత ఎన్నికల్లో చంద్రబాబు వల్ల.. ఈసారి షర్మిలతో పార్టీకి నష్టం

గత ఎన్నికల్లో చంద్రబాబు వల్ల.. ఈసారి షర్మిలతో పార్టీకి నష్టం
  • పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తా
  • దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాలి.. లేకపోతే కేసీఆర్ ను తిరగనివ్వం
  • ఢిల్లీలో మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్

న్యూఢిల్లీ: పోయిన ఎన్నికలలో చంద్రబాబు వల్ల కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగితే.. ఈ సారి షర్మిల పార్టీ బాగా నష్టం చేసేటట్లు కనపడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన అనేక విషయాలపై చిట్ చాట్ చేశారు. షర్మిల పార్టీ కాంగ్రెస్ కు బాగా నష్ట చేస్తుందని, షర్మిల పార్టీతో మాకు చాలా రిస్కు..  చాలా నష్టం కలిగేటట్లు కనిపిస్తోందన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ ఓట్లు.. మిగిలిన ఓట్లు కాంగ్రెస్, బీజేపీ, షర్మిల పార్టీల మధ్య ఓట్లు చీలే పరిస్థితి కనిపిస్తోందన్నారు. షర్మిలతో కలిసి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారని.. కనీసం 20-30 ఎమ్మెల్యే, 3 ఎంపి స్థానాలపై షర్మిల ఫోకస్ పెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 
119 సీట్లలో హైదరాబాద్ లో 7 స్థానాలు ఎంఐఎం, 4-5 స్థానాల్లో బీజేపికి పక్కన పెడితే.... మిగిలిన దాదాపు 90-100 స్థానాల్లో  కాంగ్రెస్, టీఆర్ఎస్, షర్మిలా పార్టీలు తలపడాల్సి ఉంటుందన్నారు. షర్మిలతో పొత్తుపై నిర్ణయం అధిష్టానానిదేనని, అయితే పొత్తుల వల్ల నష్టమే కాని ఎలాంటి లాభం లేదన్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు 5 శాతం లోపే ఓట్లు పడతాయని నా సర్వేలో తేలిందన్నారు. పార్టీ క్యాడిడేంట్ ప్రకటన తర్వాత పరిస్థితులు మారొచ్చన్నారు. ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడు గా ఉన్నపుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను  అన్నీ పార్టీ సమావేశాలకు పిలిచేవారు, ఇప్పుడు పిలవడం లేదన్నారు. 
చంద్రబాబు ప్రభావం కనిపిస్తోంది
ఇప్పటికీ చంద్రబాబు ప్రభావమే తెలంగాణలో ఉందని గ్రౌండ్ లెవల్ లో వినిపిస్తోందని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటి రెడ్డి కామెంట్ చేశారు. మోత్కుపల్లి గురించి స్పందించనన్నారు. కొత్త తలనొప్పి వద్దు అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రం అంతా అమలు చేయాలని..  లేకపోతే కేసిఆర్ ను తిరగనివ్వమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.