ఢిల్లీలోని ఐఐటీ ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి

ఢిల్లీలోని ఐఐటీ ఫ్లైఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి

ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న ప్రాంతం... ఆ రోడ్డంతా ఎప్పుడు వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలోని ఫ్లై ఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలోని IIT ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది.

భారీ గొయ్యి పడడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అక్కడి నుంచి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. IIT నుంచి అధ్చినికి వెళ్లే వాహనాలను కత్వారియా సరాయి ద్వారా దారి మళ్లించామని, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి ఆ మార్గంలో వెళ్లొద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతుతో ఆ గొయ్యి ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రజాపనుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు.